తిరుమల : తిరుమల (Tirumala) వేంకటేశ్వరస్వామి హుండీకి నగదు, బంగారం, వివిధ వస్తువుల రూపేణా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయాంక ( Sanjeev Goenka) స్వామివారికి శుక్రవారం భారీ విరాళాన్ని అందజేశారు. సుమారు రూ. 10 కోట్ల విలువగల బంగారు శంఖు, చక్రాలు, వరద, కటి హస్తాల ఆభరణాలను ఆలయ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.
అమెరికాలోని బోస్టన్కుచెందిన ఎన్ఆర్ఐ ఆనంద్ మోహన్ భాగవతుల నిన్న టీటీడీ ట్రస్టులకు రూ. కోటి 40 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఎస్వీ విద్యా దాన ట్రస్ట్, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్, ,ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్, ఎస్వీ
సర్వశ్రేయస్ ట్రస్ట్, ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్ట్ లకు ఈ మొత్తాన్ని ఎన్ఆర్ఐ విరాళంగా సమర్పించారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూలైన్
తిరుమల : తిరుమలలో ( Tirumala ) మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం ( Silathoranam ) వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 63,208 మంది భక్తులు దర్శించుకోగా 32,951 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 3.72 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.