నిజాంపేట,మే16 : మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ సిబ్బంది బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. నిజాంపేటలోని ఉన్నత పాఠశాల హెచ్.ఎం జ్ఞానమాల అధ్వర్యంలో నిర్వహించిన బడిబాట ర్యాలీ కార్యక్రమానికి ఎంఈవో యాదగిరి హాజరై ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పంచాలని వారి తల్లిదండ్రులకు సూచించారు. సర్కారు బడిలో నాణ్యమైన భోజనంతో పాటుతో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్‌చారి, దేవయ్య, సీఆర్పీ రాజు, క్రాఫ్ట్ టీచర్ రోజా, విద్యార్థులు తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Gujarat Samachar: గుజరాత్ సమాచార్ పత్రిక ఓనర్ బాహుబలి షా అరెస్టు