అహ్మాదాబాద్: గుజరాత్‌కు చెందిన ప్రముఖ పత్రిక గుజరాత్ సమాచార్(Gujarat Samachar) ఓనర్ బాహుబలి షాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. గుజరాత్ సమాచార్ ఆఫీసు పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు. లోక్ ప్రకాశన్ లిమిటెడ్ సంస్థకు ఆయన డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. బాహుబలి షా సోదరుడు శ్రేయాంశ్ షా.. గుజరాత్ సమాచార్ డెయిలీ పత్రికకు మేనేజింగ్ ఎడిటర్‌గా ఉన్నారు. జీఎస్టీవీ డిజిటల్ సర్వీసెస్ హెడ్‌గా తుషార్ దేవ్ ఉన్నారు. అయితే ఆ ఛానల్ శ్రేయాంశ్దే. శుక్రవారం తెల్లవారుజామున బాహుబలి షాను ఈడీ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
ఫేస్బుక్ పేజీలో షా అరెస్టు గురించి దేవ్ రాశారు. తొలుత ఈడీ అధికారులు షాను వీఎస్ ఆస్పత్రికి తీసుకెళ్లారని, ఆ తర్వాత జైడస్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఎందు చేత షాను అరెస్టు చేశారన్న విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెల్లడించలేదు. అహ్మదాబాద్‌లో ఉన్న జీఎస్టీవీ పరిసరాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సుమారు 36 గంటల పాటు సోదాలు చేశారు. ఐటీ అధికారులు వెళ్లిపోగానే గురువారం రాత్రి ఈడీ తనిఖీలు మొదలయ్యాయని దేవ్ మరో ఫేస్బుక్ పోస్టులో చెప్పారు.
ఈడీ చర్యను గుజరాత్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జిగ్నేశ్ మేవాని ఖండించారు. గుజరాత్ సమాచార్, దాని ఓవర్లను టార్గెట్ చేసినట్లు ఆరోపించారు. గత 25 ఏళ్ల నుంచి ఆ పత్రిక కేంద్ర ప్రభుత్వానికి చెందిన క్రిటికల్ రిపోర్టులను పబ్లిష్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.