నిజాంపేట్,మే16 : గత కోన్నేళ్లుగా గ్రామానికి తాగు నీటిని అందించిన వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుంది. అది కూలి ఎలాంటి ప్రమాదం జరగక ముందే అధికారులు స్పందించి వాటర్ ట్యాంక్‌ను తోలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మండల కేంద్రమైన నిజాంపేట్ గ్రామంలోని బాలికల పాఠశాల ఆవరణలో గత కొన్ని సంవత్సరాల క్రితం తాగు నీటి సరఫరా కోసం నిర్మించిన ట్యాంక్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరి చిన్నపాటి గాలులకు సైతం కదలడంతో స్థానికులు, పాఠశాల విధ్యార్థులు భయభ్రాంతులకు గురౌతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎలాంటి ప్రమాదాలు జరుగక ముందే శిథిలావస్థలో ఉన్న నీటి ట్యాంకును తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Gujarat Samachar: గుజరాత్ సమాచార్ పత్రిక ఓనర్ బాహుబలి షా అరెస్టు