Alumni | పాపన్నపేట, జూలై 27 : వారంతా ఒక్కచోట కలిసి చదువుకున్నారు. ఇప్పుడు వారంతా వివిధ వృత్తులు, ఉద్యోగాలు, పనులతో బిజీగా మారిపోయారు. చాలా కాలం తర్వాత ఆ పూర్వ విద్యార్థులంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనానికి మంజీరా గార్డెన్ వేదికైంది.
ఆదివారం పాపన్నపేటలోని మంజీరా గార్డెన్లో 2009-10 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. పాపన్నపేట ఉన్నత పాఠశాలలో చదువుకున్న 2009-10 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు 15 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనంతో మళ్లీ కలుసుకున్నారు. వారంతా పాఠశాల జీవితంలో జరిగిన తమ అనుభవాలు, అనుభూతులను గుర్తు చేసుకున్నారు.
తమకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు మహేందర్ రెడ్డి, మోహన్ రాజ్, అంజాగౌడ్, శ్రీధర్ రెడ్డి, పోచయ్య, ఆసిఫ్, మల్లేశం, జ్ఞానబ్, శ్రీనివాస్, సూర్యకళ తదితరులను ఘనంగా సన్మానించి.. వారికి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు.
Nallagonda | నల్లగొండ జిల్లాలో దారుణం.. బిడ్డను బస్టాండ్లో వదిలి వెళ్లిన తల్లి
KTR | ఎరువులు ఇవ్వలేని ముఖ్యమంత్రికి పదవిలో ఉండే అర్హత లేదు.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం
Snake in Temple | ఆలయంలో పాము కలకలం.. భయంతో హడలిపోయిన భక్తులు.. Video