Padma Devender Reddy | మెదక్ రూరల్, సెప్టెంబర్ 22 : మెదక్ మండల పరిధిలోని పేరుర్ గ్రామానికి చెందిన చింతకింది అంజమ్మ మృతి చెందగా.. ఆమె అంత్యక్రియలు మంగళవారం గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున వైకుంఠదామంలో నిర్వహించారు. అనంతరం కులస్తులు అందరూ కలిసి మంజీరా నదిలో స్నానానికి వెళ్లగా చింతకింది శ్రీకృష్ణ కాలుజారి నీటిలో మునిగిపోయాడు. అతడిని కాపాడడానికి చింతకింది బీరయ్య మంజీరా నదిలోకి దిగాడు. అతను కూడా నీటిలో మునిగి ఇద్దరు మృతి చెందారు.
ఈ విషయం స్థానికుల నాయకుల ద్వారా తెలుసుకున్న మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు , మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి బుధవారం మెదక్ జిల్లా ఆసుపత్రికి చేరుకొని మార్చురీలో ఉన్న మృతదేహాలను పరిశీలించారు. అనంతరం ఇరు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు. బాధిత కుటుంబసభ్యులకు మనో ధైర్యాన్ని అందించారు. రెండు కుటుంబాలకు రూ. 5000, రూ.10000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.
అంత్యక్రియలకు హాజరై స్నానాలు చేస్తుండగా ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమన్నారు పద్మా దేవేందర్ రెడ్డి. వీరి వెంట మండల పార్టీ అధ్యక్షుడు అంజా గౌడ్, నాయకులు జయరాం రెడ్డి, కిష్టయ్య, రాము, యాదగౌడ్, యాదగిరి, శ్రీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Tejashwi Yadav: జీవికా దీదీలకు 30 వేల జీతం: తేజస్వి యాదవ్
Road Accident: ఢీకొన్న రెండు బస్సులు.. 63 మంది మృతి
Nidamanoor : రైతులకు మద్దతు ధరే లక్ష్యం : అంకతి సత్యం