నిడమనూరు, అక్టోబర్ 22 : రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని ఊట్కూరు, మారపాక గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం తాసీల్దార్ జంగాల కృష్ణయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వ నిబంధనలు పాటించి ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఆరబెట్టిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. రైతాంగానికి మద్దతు ధర అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేశ్, నాయకులు మేరెడ్డి వెంకట్రాహుల్, నందికొండ మట్టారెడ్డి, మేరెడ్డి వెంకటరెడ్డి, కొండా శ్రీనివాస్ రెడ్డి, ముంగి శివమారయ్య, నర్సింగ్ విజయ్ కుమార్, నర్సింగ్ కృష్ణయ్య, జానయ్య, వెంకన్న పాల్గొన్నారు.