న్యూఢిల్లీ: అమెరికా వేదికగా జరిగిన ఎన్సీఏఏ ఇండోర్ చాంపియన్షిప్లో భారత యువ అథ్లెట్ సెల్వ ప్రభు రజత పతకంతో మెరిశాడు. ఆదివారం జరిగిన పురుషుల ట్రిపుల్జంప్ ఫైనల్లో సెల్వ ప్రభు 17.05మీటర్ల ఎత్తు దూకి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. వరల్డ్ అథ్లెటిక్స్ అండర్-20 టోర్నీ రజత విజేత అయిన ప్రభు జాతీయ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన ప్రభు రెండో స్థానంలో నిలిచి సత్తాచాటాడు. జాతీయ అథ్లెటిక్స్ ఫెడరేషన్(ఏఎఫ్ఐ) కఠినమైన డోపింగ్ నిబంధనలతో అథ్లెట్లు తమ జాతీయ రికార్డుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.