paddy crop | రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కుండపోత వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు నిండిపోయి పొంగిపొర్లుతుండటంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ఇక భారీ వర్షాలకు మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పట్టణంతోపాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటలు పూర్తిగా నిండి అలుగులు దుంకుతున్నాయి.
నీట మునిగిన మూడు ఎకరాల వరి పంట..
భారీ వర్షాలకు నర్సాపూర్ మండలపరిధిలోని లింగాపూర్ శివారులోని 79, 80, 81, 82 సర్వే నెంబర్లలో గల వరి పంట పూర్తిగా నీట మునిగింది. గొల్లపల్లి గ్రామ సమీపంలోని నాగల చెరువుపై భాగంలో ఈ పొలం ఉండడంతో చెరువులోకి వచ్చిన విపరీతమైన వరదతో పై భాగంలోని పంట పూర్తిగా నీట మునిగింది. పంట నీట మునగడంతో భారీగా నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు ఆర్థిక సహాయం అందజేసి తమను ఆదుకోవాలని రైతులు కోరారు.
వాతావరణ శాఖ హెచ్చరికలు..
కాగా జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిందని తెలిసిందే. అదేవిధంగా హన్మకొండ, కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబ్బాద్, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Cybercrime | సైబర్ వలలో ఆలయ ఉద్యోగి.. లక్షల్లో మోసపోయిన బాధితుడు
Clay Ganesh | కండ్లకు గంతలు కట్టుకొని.. కేవలం 54 నిమిషాల్లో గణనాథుని విగ్రహం తయారీ
Kamareddy Rains | రెస్క్యూ టీంను పంపించండి సార్.. కామారెడ్డి కాలనీల్లో వరద ముంపు బాధితుల ఆర్తనాదాలు
Watch: పసి బిడ్డకు టీకా వేసేందుకు.. ఉప్పొంగుతున్న వాగును దాటిన ఆరోగ్య కార్యకర్త