Collector Rahulraj | చిలిపిచెడ్, జూలై 14: మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులకు సమృద్ధిగా 4,500 మెట్రిక్ టన్నుల యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో ఉంచామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం చిలిపిచెడ్ మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. ధరల పట్టికలను పరిశీలించారు. రైతులను విత్తన ధరలపై అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇండెంట్ ఆధారంగా అవసరానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఎరువులు, పురుగు మందులు సరఫరా చేస్తుందని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఎరువులు, పురుగు మందులు కొరత ఎక్కడ లేదన్నారు. యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు. రైతులందరికీ నాణ్యమైన విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన పక్షంలో సమస్యను పరిష్కరిస్తూ కొత్త సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టామన్నారు. వానాకాలంలో పంటలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులందరికీ రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగిందని, వర్షాకాలం పంటలను జిల్లాలో సమృద్ధిగా పండించుకుని రైతు కుటుంబాలు ఆర్థిక అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Juluri Gourishankar | జూలూరి గౌరీశంకర్ రచించిన ‘బహుజనగణమన’ ఆవిష్కరణ
Student | అదృశ్యమైన ఆరు రోజుల తర్వాత.. యమునా నదిలో శవమై తేలిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని