Badi bata | పాపన్నపేట, జూన్ 8 : మండల కేంద్రమైన పాపన్నపేటలో ఆదివారం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బడిబాటలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. పాపన్నపేట ఉన్నత పాఠశాలలో అత్యంత విద్యావంతులై, మంచి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని ప్రైవేట్ పాఠశాలలు కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోటివేట్ చేస్తున్నారు.
విద్యార్థులు ప్రభుత్వ బడులకి వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా సంస్థానాదీషుల కోట ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంజా గౌడ్, మంగ నరసింహులు, శ్రావణ్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Badibata | బడిబాట కార్యక్రమం ప్రారంభించిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ పోచయ్య
Edupayala | ఏడుపాయలలో భక్తుల సందడి
Telangana Cabinet | తెలంగాణ కేబినెట్లోకి ముగ్గురు మంత్రులు.. రాజ్భవన్లో ప్రమాణస్వీకారం పూర్తి