MLA Sunitha lakshma reddy | నర్సాపూర్, ఆగస్టు 24 : శివ్వంపేట మండలం రత్నా పూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వైద్యులకు సూచించారు.
శనివారం ఉదయం రత్నాపూర్లోని అంగన్వాడీ కేంద్రం పిల్లలు భోజనం చేసి మంచినీళ్లు తాగిన అనంతరం వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానాకు తరలించగా.. ఆదివారం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి దవాఖానాను సందర్శించి చిన్నారులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. చిన్నారులు త్రాగే నీటిలో ఎలుక పడటం సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోందన్నారు. ఇప్పటికైనా చిన్నారుల ఆలానా పాలన పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. ఆమె వెంట బీఆర్ఎస్ శ్రేణులు మన్సూర్ , పబ్భ మహేష్ గుప్త , కల్లూరి హరికృష్ణ, చంద్రశేఖర్, శివకుమార్ తదితరులు ఉన్నారు.
Rat | నీళ్ల బిందెలో ఎలుక.. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అస్వస్థత
Daisy Shah | వాళ్లకి నడుము, బొడ్డు పిచ్చి ఉంది.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన వ్యాఖ్యలు
IADWS | ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ
Finger Millet | రాగులను అసలు రోజుకు ఎంత మోతాదులో తినాలి..? వీటితో కలిగే లాభాలు ఏమిటి..?