MLA Sunitha Lakshma Reddy | చిలిపిచెడ్, సెప్టెంబర్ 23 : చిలిపిచెడ్ మండలంలోని సామ్‌ల తాండ, బద్రియతాండాలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ జగదాంబ సేవలాల్ మహారాజ్‌కు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం మండలంలోని సామ్‌ల తాండ మాజీ సర్పంచ్ బిక్షపతి నాయక్ ఆధ్వర్యంలో సేవలాల్ మహారాజ్‌కు బోనాలు సమర్పించారు.
అదే విధంగా స్వామ్ల తాండ, భద్రయ్య తాండ స్వామి మాల వేసిన భక్తులు విహార యాత్రకు వెళ్లారు. సామ్‌ల తండాలో తాండ మహిళలు సంప్రదాయాల దుస్తులతో బోనాలు తీయడంతో.. ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి గిరిజన మహిళలతో వారి సంప్రదాయ దుస్తుల్లో నాట్యం చేసి బోనాలు సమర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ కృప నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని.. గిరిజనులు అందరూ మంచి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు అశోక్ రెడ్డి, నాయకులు బేస్త లక్ష్మణ్, గోపాల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, దుర్గారెడ్డి, శంకరయ్య, విట్టల్, శ్రీకాంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, అంబర్ సింగ్, దుర్గ నాయక్, బుజ్జి బాయ్ తదితరులు పాల్గొన్నారు.
Hyderabad Metro | మరోసారి ఆగిపోయిన మెట్రో రైలు.. ఆందోళనకు గురైన ప్రయాణికులు
Fire Accident | మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో తప్పిన పెను ప్రమాదం
Harish Reddy | నెలరోజులైనా తెరచుకోని రామగుండం ఎరువుల కర్మాగారం: బీఆర్ఎస్ నేత హరీశ్ రెడ్డి