IKP Centres | చిలిపిచెడ్, అక్టోబర్ 8 : వాన కాలం సీజన్ వరి ధాన్యం కొనుగోలుకు ధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరి కోతలు ప్రారంభం కావడంతో జాగ్రత్తగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు మండల ఐకేపీ ఏపీఎం గౌరీ శంకర్ పేర్కొన్నారు. బుధవారం చిలిపిచెడ్ మండలంలోని ఐకెపి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 7 ఐకెపి కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామ సంఘాల అధ్యక్షురాలిచే ప్రారంభించడం జరిగిందన్నారు.
చిలిపిచెడ్ మండలంలోని శిలాంపల్లి, జగ్గంపేట, గంగారం, సామ్‌ల తాండ, రాందాస్ గూడా, చండూరు, చిట్కుల్ లో కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎవరికి ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలు సాఫీగా కొనసాగుతాయని తెలిపారు. ఈ వానకాలం సీజన్లో ఏ గ్రేడ్ రకానికి రూ.2389, బి గ్రేడ్ రకానికి రూ.2369, సన్న రకానికి బోనస్ రూ.500 చెల్లిస్తారని తెలిపారు.
రైతులు ముఖ్యంగా ధాన్యమును తూకం వేసిన తర్వాత సెంటర్ ఇన్చార్జికి తమ పట్టా పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సీసీ వెంకటలక్ష్మి, సీఏ మాధవి అధ్యక్షురాలు రమాదేవి పాల్గొన్నారు.
Compensation | రోడ్డు ప్రమాదంలో భార్య మృతి.. 11 ఏళ్ల తర్వాత భర్తకు రూ.51 లక్షల పరిహారం..!
Madhira | మధిర మిర్చి మార్కెట్లో కోల్డ్ స్టోరేజ్ సిబ్బంది, ఏపీ వ్యాపారి అక్రమ దందా..?