The Bads of Bollywood | షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ (The Bads of Bollywood) వెబ్ సిరీస్‌పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడే దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌లోని ఒక పాత్ర నిజ జీవితంలో తనను పోలి ఉందని.. ఇది చూసిన తర్వాత ప్రేక్షకుల తనని తన కుటుంబాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆరోపిస్తూ సమీర్ వాంఖడే హైకోర్టును ఆశ్రయించాడు. అయితే దీనిపై నేడు విచారణ జరిపిన హైకోర్టు చిత్ర నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ కేసును అక్టోబర్ 30కు వాయిదా వేసింది.