Harvesters | చిలిపిచెడ్, ఏప్రిల్ 23 : కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు బీభత్సం సృష్టిస్తూ రైతులను భయాందోళనలకు గురి చేస్తున్నాయని తెలిసిందే. ఈదులుగాలులు, వడగండ్లతో పంట ఎక్కడ దెబ్బతింటుందోనన్న భయంతో పంట కోతకు రైతులు తొందరపడుతున్నారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో హార్వెస్టర్ యంత్రాలకు డిమాండ్ పెరిగింది. రైతులు రేటు మాట్లాడుకుని ముందుగా చెప్పినప్పటికీ హార్వెస్టర్ల యాజమానులు మాత్రం పరిస్థితులకు అనుగుణంగా ఏదో కారణం చెబుతూ ఉన్నారు. ఎక్కడ డబ్బులు ఎక్కువ ఇస్తే అక్కడికి హార్వెస్టర్ యంత్రాలను కోతకు పంపిస్తున్నారు.
ఇక రైతులు చేసేదేమి లేక యజమానులు చెప్పిన ధర చెల్లించాల్సి వస్తున్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టైర్ హార్వెస్టర్కు గంటకు రూ.2200, చైన్ హార్వెస్టర్కు రూ.2600లు చెల్లించాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు.
Errabelli Dayakar Rao | ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో భారీగా చేరికలు
KTR | పెంబర్తి వద్ద కేటీఆర్కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి