Jeelugu Seeds | చిలిపిచెడ్, జూన్ 1 : చిలిపిచెడ్ మండలంలో జీలుగు, జనుము విత్తనాలు అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులకు వర్షాకాలం ప్రారంభానికి నెల ముందు జీలుగులు, జనుము విత్తనాలు అవసరం ఉంటోంది. కాని రోహిణీ కార్తె ప్రారంభం అయి వారం రోజులు అవుతున్నా ఇప్పటికీ చిలిపిచెడ్ మండల రైతులకు జీలుగు, జనుము విత్తనాలు మండల వ్యవసాయాధికారులు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిలిపిచెడ్ మండలంలో రైతులు ఎవరు లేరా..? ఉంటే ఎందుకు జీలుగు విత్తనాలు అందించడం లేదు అని రైతులు ఏఈవోను రైతు వేదికలో నిలదీసారు. అయిన ఏఈవో ఇంకా మూడు లేదా నాలుగు రోజుల్లో మండలంకు జీలుగు విత్తనాలు వస్తాయని సమాధానం ఇచ్చారు. రోహిణి కార్తె కంటే ముందే వర్షాలు ప్రారంభం అయినప్పటికి జీలుగు విత్తానాలు ఇవ్వకపోతే ఎప్పుడు వస్తాయి.. ఎప్పుడు పొలంలో చల్లాలని రైతులు ఏఈవో ముందు ఆవేదన చెందారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయా శాఖ అధికారులు స్పందించి చిలిపిచెడ్ మండలానికి జీలుగు, జనుము విత్తనాలు త్వరగా అందజేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ఉన్నపుడు 30 కేజీల జీలుగు బస్తాకు రూ.1150 : రైతు వీరాస్వామి అజ్జమర్రి గ్రామం
కేసీఆర్ ప్రభుత్వం ఉన్నపుడు రోహిణి కార్తె కంటే నెల ముందు ఆగ్రో రైతు సేవ కేంద్రాలకు వచ్చేవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినక రోహిణి కార్తె వచ్చి వారం రోజులు అవుతున్నా ఇప్పటికి జీలుగు, జనుము బస్తాలు రావడం లేదు. పక్కన ఉన్న సంగారెడ్డి జిల్లా హత్నూర, సిరిపురం, జోగిపేట నుంచి జీలుగులు తెచ్చి పొలంలో చల్లాలనుకుంటున్నాం.
గత కేసీఆర్ ప్రభుత్వంలో 30 కేజీ జీలుగు బస్తాకు రూ.1150 ధరకు ఇచ్చేవారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను నిండ ముంచడానికి అదే 30 కేజీల జీలుగు బస్తాకు రూ.2150 ధరతో రైతులకు అమ్ముతున్నారు. రైతును రాజును చేస్తానన్న ప్రభుత్వం రైతులకు ఎందుకు ఇంత ధర పెట్టి జీలుగులు అమ్ముతున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతులకు తక్కువ ధరకు అమ్మకాలు చేపట్టాలన్నారు.
Rajanna Kodelu | వేములవాడ రాజన్న కోడెలకు దరఖాస్తులు..
Mallapur | మల్లాపూర్‌లో విషాదం.. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
Housefull 5 | ఒకే సినిమాకు రెండు క్లైమాక్స్‌లు.. ‘హౌస్‌ఫుల్ 5’ కొత్త ప్రయోగం!