Farmers | మెదక్ రూరల్, ఏప్రిల్ 29 : రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మెదక్ సొసైటీ చైర్మన్ చిలుముల హనుమంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇవాళ మెదక్ మండలంలోని పేరూరులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోద్దని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలని సెంటర్ నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శంకర్, బీసీ సంఘం అధ్యక్షుడు అనిల్ కుమార్, ఐలయ్య, సాయిలు, షేకులు, బీరప్ప, కుమార్, నరేష్ ,యాదగిరి జనార్ధన్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
Mark Carney | ‘కార్నీ’వాల్.. టైమ్ టు విన్ పాటకు స్టెప్పులేసిన కెనడా ప్రధాని.. VIDEO
Dr. Haripriya | వైద్య సిబ్బంది గ్రామాలకు వెళ్లాలి : డాక్టర్ హరిప్రియ
CITU | కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం