తడి లేని కన్నీటి చుక్క
నిశ్శబ్దం రంగు పులుముకొని గోడల మీద పాకుతోంది అక్షరాలు విడిపోయి అర్థం లేని ఆకృతులుగా మారుతున్నాయి. కాలం.. చిరిగిన కాగితంలా జ్ఞాపకాల్లో తేలుతూ రేపటి తలుపుల మీద గుసగుసలాడుతోంది.
నిశ్శబ్దం రంగు పులుముకొని
గోడల మీద పాకుతోంది
అక్షరాలు విడిపోయి అర్థం లేని
ఆకృతులుగా మారుతున్నాయి.
కాలం.. చిరిగిన కాగితంలా
జ్ఞాపకాల్లో తేలుతూ
రేపటి తలుపుల మీద
గుసగుసలాడుతోంది.
గుండెచప్పుడును
ఓ సాలీడు వెక్కిరిస్తూ
గది నిండా శూన్యాన్ని అల్లుతోంది.
గడియారం ముల్లు ఆగిపోయినచోట
కాలం తన చొక్కా విప్పి
ఆరేసుకుంటోంది.
జ్ఞాపకాల అరల్లో వెతుకుతున్నా..
తప్పిపోయిన నా స్వరాన్ని!
దూరంగా ఒక పిలుపు..
అది గాలీ కాదు,
నా ఊహా కాదు..
ఒక తడి లేని కన్నీటి చుక్క.
ప్రవహించేది నది..
నిలిచిపోయేది చెరువు..
కానీ, లోలోపలే ఇంకిపోయేది
శూన్యపు ఎడారి.
అక్కడ గాయం ఉంటుంది
కానీ రక్తం ఉండదు,
దుఃఖం ఉంటుంది
కానీ తడి ఉండదు.
కనురెప్పల వెనుక ఒక సముద్రం..
అందులో అలలు లేవు,
కేవలం లోతు మాత్రమే.
ప్రశ్న అడగకముందే
సమాధానం మరణించింది,
ఇప్పుడు మిగిలింది కేవలం..
నిశ్శబ్దం రాస్తున్న
అసంపూర్ణ కావ్యం!
– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి 80085 77834
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

