Boat capsize | కోసీ నదిలో పడవ మునక.. ఒకరు మృతి.. 12 మంది గల్లంతు.. Video
Boat capsize | కోసి నది (Kosi river) లో బుధవారం విషాదం జరిగింది. మొత్తం 13 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ తలకిందులై నీట మునగడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మిగతా 12 మంది గల్లంతయ్యారు. బీహార్ రాష్ట్రం (Bihar state) దర్భంగా జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీమ్స్ (Rescue teams) గాలిస్తున్నాయి.
Boat capsize : కోసి నది (Kosi river) లో బుధవారం విషాదం జరిగింది. మొత్తం 13 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ తలకిందులై నీట మునగడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మిగతా 12 మంది గల్లంతయ్యారు. బీహార్ రాష్ట్రం (Bihar state) దర్భంగా జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీమ్స్ (Rescue teams) గాలిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. నదికి ఒకవైపు గ్రామంలోని కూలీలు అవతలివైపు గ్రామంలో పెసరపంట కోసేందుకు వెళ్లారు. పని ముగిసిన అనంతరం వారంతా స్వగ్రామానికి చేరుకునేందుకు పడవలో నది దాటుతుండగా ప్రమాదం జరిగింది.
తర్వారా ఘాట్ దగ్గర ఉన్న వృత్తాకార గట్టు సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పడవ మునగగానే అందులోని 13 మంది గల్లంతయ్యారని, అయితే రెస్క్యూ టీమ్స్ గాలించగా ఒకరి మృతదేహం లభ్యమైందని చెప్పారు. కాగా గత నెలలో కూడా బీహార్లోని సమస్తిపుర్ జిల్లాలో పడవ నీట మునిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురి జాడ గల్లంతయింది. ఆ సమయంలో పడవలో 14 మంది ప్రయాణిస్తున్నారు. బలమైన గాలుల కారణంగా పడవ అదుపుతప్పి బోల్తా పడింది. అంతకుముందు ఏప్రిల్లో కూడా మధ్యప్రదేశ్లోని బార్గి డ్యామ్ రిజర్వాయర్ సమీపంలోని నర్మదా నదిలో పర్యాటకుల పడవ తుపానులో చిక్కుకుని తలికిందులైంది. కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
VIDEO | Bihar: A boat carrying 13 people capsizes in Kosi River in Darbhanga. One body has been recovered. Rescue operations are underway. More details are awaited.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/2Y5NU01VQo
— Press Trust of India (@PTI_News) June 10, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

