– దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
– లబ్ధిదారులకు రూ.67,07,772 విలువ గల చెక్కుల పంపిణీ
చందంపేట, ఆగస్టు 12 : చందంపేట, డిండి మండలాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తాసీల్దార్ కార్యాలయ సిబ్బందితో కలిసి బుధవారం చెక్కులను పంపిణీ చేశారు. చందంపేట మండలానికి 59 చెక్కులు, డిండి మండలానికి 8 చెక్కులు.. మొత్తం 67 చెక్కులను రూ.67,07,772 విలువతో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక భరోసా కల్పించడమే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ సత్యనారాయణ గౌడ్, గోవింద్ యాదవ్, మల్లారెడ్డి, హరికృష్ణ, సాదిక్, మకట్ లాల్, జాలేందే గౌడ్, బాధ్యనాయక్, మున్నాయా యాదవ్, శంకర్ రావు, ఎంపీడీఓ వెంకటేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.