మునుగోడు, ఆగస్టు 12 : మునుగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఇన్ఛార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ రకాల మరమ్మతు పనులను ఆయన నిశితంగా పరిశీలించారు. అనంతరం ఆస్పత్రికి అందుతున్న వైద్య సేవలు, రోగుల వివరాలు, మరమ్మతు పనుల పురోగతిపై ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ నర్మదను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జిల్లా వైద్యాధికారి మాట్లాడూతూ… ఆస్పత్రిలో చేపడుతున్న మరమ్మతు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని కాంట్రాక్టర్లు, సిబ్బందిని ఆదేశించారు.