Vladimir Putin | రష్యాలో ఎదురులేని పుతిన్.. పార్లమెంటరీ ఎన్నికల్లో పుతిన్ పార్టీ ఘన విజయం
Vladimir Putin : రష్యాలో తనకు తిరుగులేదని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి నిరూపించుకున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పుతిన్‌కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీ ఘన విజయం సాధించింది.
Vladimir Putin : రష్యాలో తనకు తిరుగులేదని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి నిరూపించుకున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పుతిన్‌కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో పుతిన్ రష్యాలో మరోసారి తన పట్టు నిలుపుకొన్నారు. రష్యాలో గతవారం మూడు రోజులపాటు పార్లమెంటరీ ఎన్నికలు జరిగాయి. సోమవారం ఫలితాలు వెల్లడయ్యాయి.
డ్యూమాగా పిలిచే రష్యా పార్లమెంట్లో 455 స్థానాలకు ఎన్నికలు జరగగా.. 355 స్థానాల్లో పుతిన్ పార్టీ విజయం సాధించింది. పుతిన్ పార్టీకి మొత్తం 57.83 శాతం ఓట్లు నమోదయ్యాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో ఇది 49.8 శాతమే. డ్యూమా.. రష్యా ఫెడరల్ అసెంబ్లీకి చెందిన దిగువ సభ. ఈ సభలో మెజారిటీ ఉంటే ఏకంగా రష్యా రాజ్యాంగాన్నే మార్చే హక్కు ఉంటుంది. తాజా ఎన్నికలు పుతిన్‌కు చాలా కీలకం. ఎందుకంటే.. 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యాలో జరిగిన తొలి ఎన్నికలివి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పుతిన్‌పై స్థానిక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందనే ప్రచారం ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు పుతిన్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం ఆసక్తికరం. దీంతో పుతిన్‌కు రష్యాలో ఇంకా ఆదరణ ఉందని, పెద్దగా వ్యతిరేకత లేదని స్పష్టమైంది. పుతిన్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఆ పార్టీ ఎన్నికల చీఫ్ ఎల్లా పాంఫిలోవా మాట్లాడారు. తమకు మద్దతుగా నిలిచిన ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో రష్యా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ద రష్యన్ ఫెడరేషన్ (సీపీఆర్ఎఫ్) 40 సీట్లు, 13.8 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. లిబరల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ రష్యా (ఎల్‌డీపీఆర్) 25 సీట్లు 8.99 శాతం ఓట్లతో మూడో స్థానం సాధించింది. తర్వాత ద న్యూ పీపుల్ పార్టీ (ఎన్పీపీ) 20 సీట్లు, 7.96 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

