కారేపల్లి, జూన్ 10 : కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాధపల్లి గ్రామానికి చెందిన సుతారి మేస్త్రి చిత్తులూరి వీరయ్య(48) బుధవారం ఉదయం, కొమ్ముగూడెం గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి మోకాళ్ల బుచ్చి రాములు(50) మంగళవారం రాత్రి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు మనీశా లక్ష్మి మృతుల స్వగ్రామాలకు చేరుకుని నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె వెంట మాజీ జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకుడు షేక్ గౌసుద్దీన్, నాయకులు తాత వెంకన్న, లకావత్ రాము, జడల కళ్యాణ్, డొంకేనా రవీందర్, పల్లపాటి ఉపేందర్, రాజేష్, హరీష్, ఖలీల్ ఉల్లాఖాన్, రవీందర్ రెడ్డి, తాత ఉపేందర్ ఉన్నారు.

పలు కుటుంబాలకు బీఆర్ఎస్ నాయకురాలు మనీశా పరామర్శ