DCP Dara Kavitha | మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు: డీసీపీ దార కవిత
సమాజానికి చెడు చేసే మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత అన్నారు.
వరంగల్ చౌరస్తా: సమాజానికి చెడు చేసే మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత అన్నారు. బుధవారం ప్రజాపాలన -ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా మట్టెవాడ పోలీసుల ఆధ్వర్యంలో వరంగల్ ఎంజీఎంహెచ్ డీ – అడిక్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సామాజిక అవగాహణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరై మత్తు పదార్ధాలకు బానిసలుగా మారి చికిత్స పొందుతున్న వారికి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్తు మానవ శరీరాన్ని నిర్వీర్యం చేస్తుందని, సమాజంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని అన్నారు.
మత్తుకు బానిసలుగా మారుతున్న వారు, మత్తును అలవాటు పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని అన్నారు. దీనిని నివారించడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని అన్నారు. సమాజంపై ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించిన నాడు ఇలాంటి వాటిని నివారించడం సులభతరం అవుతుందని అన్నారు. మత్తును వీడాలని అనుకునే వారు డీ అడిక్షన్ సెంటర్లను ఆశ్రయించడం ద్వారా శాస్త్రీయంగా, శాశ్వతంగా మత్తుకు దూరంగా ఉండడానికి వీలు కలుగుతుందని చెప్పారు.
అనంతరం ఎంజీఎంహెచ్ ఆవరణలో మొక్కలు నాటారు. ఎంజీఎం వైద్యాధికారి డాక్టర్ అశ్విన్, ఈగిల్ ఫోర్స్ ఏసీపీ రమేష్, మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్‌రావు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, ఈగిల్ ఫోర్స్ సిబ్బంది, తదితరులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

