Suicide | చేగుంట, అక్టోబర్ 07 : ఆర్ధిక ఇబ్బందులతో పురుగుల మందు సేవించి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.
చేగుంట పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చేగుంట మండల పరిధిలోని పోలంపల్లి గ్రామనికి చెందిన రైతు వట్టెం రమేష్ (35)తన సంసార విషయంలో చేసిన అప్పుల కోసం భార్యభర్తలకు తరుచూ గోడవలు పడుతూ ఈ నెల 4న అర్ధరాత్రి ఇంట్లో పురుగుల మందు సేవించాడు.
కుటుంబీకులు గమనించి, చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు మృతుడి మామ ఏశం కిషన్ ఫిర్యాదు మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు.
Kumram Bheem | కుమ్రం భీం ఆశయ సాధనకు కృషి చేయాలి : బానోత్ గజానంద్
Chief Justice BR Gavai | చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి హేయమైన చర్య : గుణిగంటి మోహన్
Metpalli | సీజేఐపై దాడికి నిరసనగా విధుల బహిష్కరణ