మెట్పల్లి, అక్టోబర్ 7: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై దాడికి నిరసనగా మంగళవారం మెట్పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. కోర్టు ప్రాంగణం ఎదుట న్యాయవాదుల నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్‌రెడ్డి మాట్లాడుతూ న్యాయవ్యవస్థను దేశంలోని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, కించపరిచే విధంగా ఎవరు వ్యవహరించినా చట్టపరంగా శిక్షార్హులే అవుతారని అన్నారు.
దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై దాడికి పాల్పడిన న్యాయవాదిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ ఆసోసియేషన్ ఉపాధ్యక్షులు తోగిటి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, ఏజీపీ అబ్దుల్ హఫీజ్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.