నార్నూర్, అక్టోబర్ 7 : ఆదివాసీ హక్కులకై నైజాం సర్కారుతో పోరాడిన ఆదివాసీ ముద్దుబిడ్డ కుమ్రం భీం ఆశయ సాధనకు కృషి చేయాలని సర్పంచ్ల సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ గజానంద్ ఆకాంక్షించారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో కుమ్రం భీం 85వ వర్ధంతిని నిర్వహించారు. కుమ్రం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుమ్రం భీం స్పూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నార్నూర్ ఎస్ఐ అఖిల్, నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, ఐటీడీఏ మాజీ డైరెక్టర్ మాడవి మాన్కు, సహకార సంఘం డైరెక్టర్ దుర్గే కాంతారావు, పీసా చట్టం కోఆర్డినేటర్ రాథోడ్ సికిందర్, మాజీ జడ్పిటిసి హేమలత, జై భారత్ జిల్లా కోఆర్డినేటర్ పేందోర్ దీపక్, నాయకులు మహేందర్, ప్రకాష్, రాథోడ్ దేవి కా బాయ్, బానోత్ ప్రణీత, చంద్రశేఖర్, సుల్తాన్ ఖాన్, సయ్యద్ ఖాసిం, రాథోడ్ సుభాష్, మహ్మద్ ఖురేషి, ఫిరోజ్ ఖాన్, ఆర్కా గోవింద్, శివాజీ, రమేష్, విష్ణు తదితరులు ఉన్నారు.