నిజాంపేట,మే5 : నిజాంపేట మండల వ్యాప్తంగా గాలి వాన బీభత్సం సృష్టించింది. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే ఒక్క వానతో అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి. రైతులు కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయాయి. చెట్లు విరిగిపోయి నివాసాలపై పడి తీవ్రంగా నష్టం జరిగింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిజాంపేటకు చెందిన మామిడి రైతు పంజా శ్రీనివాస్ 5 ఎకరాల మేర మామిడి తోటను సాగు చేస్తున్నాడు. గాలివానకు మామిడి కాయలు నేలరాలాయి. సుమారు రూ.5 లక్షల వరకు నష్టం జరిగిందని, తమను ఆర్థికంగా ఆదుకోవాలని పంజా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు.
ఇవి కూడా చదవండి..
Herione | ఈ హీరోయిన్ ఇంత బరువు పెరిగిపోయిందేంటి.. తన పొట్ట చూసి షాక్ అయిపోయింది..!
Traffic Alert | హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. సాయంత్రం 4 తర్వాత ఈ రూట్లలో వెళ్లారో అంతే సంగతి..