Herione | సినిమా లేదా సీరియల్ స్టార్స్ ఎప్పుడు ఫిట్‌గా ఉండాలని తపన పడుతుంటారు. నాజూకుగా ఉంటేనే అవకాశాలు దక్కుతాయని వారికి తెలుసు. అందుకే ప్రతి రోజు జిమ్‌లలో గంటల తరబడి ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటారు. ఆహారం విషయంలో కూడా కొంత నియంత్రణ పెట్టుకుంటారు. అయితే ఇవన్నీ చేస్తున్న సమయంలోనే వారు స్లిమ్‌గా కనిపిస్తారు. కాస్త అశ్రద్ధ చేశారో బాడీలో చేంజ్ వచ్చేస్తుంది. అప్పటిదాకా ముద్దుగుమ్మగా కనిపించిన వారు బొద్దుగుమ్మగా మారొచ్చు.గతంలో చాలా మంది పరిస్థితి ఇలానే అయింది.
తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ బొద్దుగా మారడం చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు వెంకటేష్ హీరోగా తెరెక్కిన గురు సినిమాలో కథానాయికగా నటించి తెలుగు ప్రేక్షకులని అలరించిన రితికా సింగ్. ఈ అమ్మడు ముంబైలో జన్మించింది. 2016 లో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన తర్వాత తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ సినిమాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. గత సంవత్సరం విడుదలైన రజనీ కాంత్ ‘వేట్టయన్’ సినిమాలో రితిక ఓ కీలక పాత్ర పోషించగా, ఆ సినిమా హిట్ కావడంతో పాటు ఆమె పాత్రకి కూడా మంచి పేరు వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో రితిక సినిమాలలో నటించడం లేదు.
రితికా నటించిన చిత్రాలేవి విడుదల కాలేదు. అయితే సినిమాలు లేక ఫిట్నెస్ విషయంలో కాస్త అశ్రద్ధ చూపిందో ఏమో షేప్ పూర్తిగా కోల్పోయింది. ఆమె అద్దంలో తన పొట్టను చూసి షాక్ అయ్యింది. తానేందుకిలా మారిపోయానంటూ ఆలోచించి తన వెయిట్ లాస్ జర్నీ ప్రారంభించింది. గతంలోలా మళ్లీ నాజుకుగా, సన్నగా మారాలని ప్రతిజ్ఞ చేసుకొని మూడు నెలల్లో అనుకున్నది సాధించింది. శరీరంలోని కొవ్వును, అలానే తన బరువును తగ్గించుకొని అందరిలో స్పూర్తిని నింపింది. తాను మాట్లాడుతూ.. గత మూడు నెలల్ని ఎప్పటికీ మరిచిపోలేను. బాగా బరువు పెరిగి మోకాళ్ల నొప్పితో నా పరిస్థితి మరింత దారుణం అయింది. నొప్పి తట్టుకోలేకపోయాను. డ్యాన్స్ కూడా చేయలేకపోయాను. దాంతో అన్నింటిని కంట్రోల్లో పెట్టేశా. ఎన్నో సవాళ్లని ఎదుర్కొని మళ్లీ మాములుగా మారాను అని రితికా పేర్కొంది.