Sankara Nethralaya | భారత పారిశ్రామికవేత్త, శాంతా బయోటిక్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డితో శంకర నేత్రాలయ USA ఇటీవల ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించింది. అట్లాంటాలో శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో సుమధుర సంగీత, సాహిత్య, నృత్య సమ్మేళనాల సాక్షిగా ఈ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కోశాధికారి మూర్తి రేకపల్లి, పాలకమండలి సభ్యులు శ్రీని వంగిమళ్ళ, ఉపేంద్ర రాచుపల్లి, నీలిమ గడ్డమణుగు,డా. కిశోర్ రసమల్లు, రాజేష్ తడికమల్లల కీలక పాత్ర పోషించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా శంకరనేత్రాలయ USA సంస్థ నిర్వహిస్తున్న MESU కార్యక్రమాలను డాక్టర్ వరప్రసాద్ రెడ్డి అభినందించారు. తనవంతుగా రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. గతంలో ప్రకటించిన రూ.25 లక్షలతో కలిపి మొత్తం రూ.50 లక్షలను శంకర నేత్రాలయ USAకు వరప్రసాద్ రెడ్డి అందించారని బాలారెడ్డి ఇందుర్తి తెలిపారు. ఈ విరాళంతో ఐదు MESU Adopt-A-Village కంటి చికిత్సా శిబిరాలు నిర్వహించవచ్చని పేర్కొన్నారు. 2026లో ఏపీలోని నెల్లూరులో మరో భారీ కంటి చికిత్సా శిబిరాన్ని నిర్వహించడానికి డా. వరప్రసాద్ రెడ్డి తమ అంకితభావాన్ని ప్రకటించారని తెలిపారు.
తనUSA పర్యటనలో భాగంగా డాక్టర్ వరప్రసాద్ రెడ్డి డాలస్ను కూడా సందర్శించారు. ఆయన మిత్రుడు లెనోక్స్ ఇంటర్నేషనల్ కంపెనీ సీటీవో ప్రకాశ్ బేడపూడి నిర్వహించిన ఆత్మీయ సమావేశంలోనూ వరప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరప్రసాద్ రెడ్డి జీవిత సత్యాలు, సందేశాలు, ఆత్మీయుల ముచ్చట్లతో ఆ కార్యక్రమం సందడిగా సాగింది. ఈ ఆత్మీయ సమావేశానికి శంకర నేత్రాలయ USA పాలకమండలి సభ్యుడు డాక్టర్ రెడ్డి NRU) ఊరిమిండి హాజరై.. సంస్థ లక్ష్యాలను, సేవలను వారితో పంచుకున్నారు. ఈ సందర్భంగా శంకర నేత్రాలయ సంస్థకు ప్రకాశ్ బేడపూడి రూ.50వేల విరాళాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన స్నేహితులు అదనంగా మరో రెండు MESU Adopt-A-Village కంటి చికిత్సా శిబిరాలకు మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చారని అన్నారు. ఇతర విరాళాలతో కలిపి డాలస్ కార్యక్రమంలో దాదాపు లక్ష డాలర్ల వరకు విరాళాలు ప్రకటించడం సంస్థ కార్యక్రమాలకు ఉత్సాహాన్ని ఇచ్చిందని బాలారెడ్డి ఇందుర్తి తెలిపారు.
Sankara Nethralaya3