మహిళా ప్రాతినిధ్యంపెరగాలి
ఆర్థిక స్వాతంత్య్రం వచ్చినప్పుడే మహిళలకు గౌరవం దక్కుతుందని, ఆ దిశగా ప్రతి ఒక్క ఆడబిడ్డ ప్రయత్నం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సిటీబ్యూరో/కొండాపూర్, మార్చి 7(నమస్తే తెలంగాణ) : ఆర్థిక స్వాతంత్య్రం వచ్చినప్పుడే మహిళలకు గౌరవం దక్కుతుందని, ఆ దిశగా ప్రతి ఒక్క ఆడబిడ్డ ప్రయత్నం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. చందానగర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పలు రంగాల్లో సేవలు అందించిన వారిని సత్కరించి పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్నారు. ఆడబిడ్డలు తమ కాళ్ల మీద నిలబడాలన్నారు. ఆర్థిక స్వాతంత్య్రం సాధించేందుకు ముందుకు సాగాలన్నారు. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో రాణిస్తూ కుటుంబాలకు ఆసరాగా నిలవాలన్నారు. ఆ స్థాయికి ఎదిగినప్పుడే సమాజంలో మహిళలకు గౌరవం, గుర్తింపు ఉంటుందన్నారు.
పార్టీ కార్యాలయం ప్రారంభం
చందానగర్లోని విద్యానగర్ కాలనీలో సీనియర్ నాయకులు నవతారెడ్డి ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. అనంతరంలో పార్టీలో చేరిన వివిధ నాయకులకు కండువా కప్పి గులాబీ పార్టీలోకి ఆహ్వానించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఆడబిడ్డల ఆశీస్సులతో తెలంగాణలో మరోసారి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను తీసుకువస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారావు, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మమత తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

