BRS Leaders | శివ్వంపేట, సెప్టెంబర్ 2 : కాళేశ్వరం ప్రాజెక్టుపై రూపొందించిన కాంగ్రెస్ ప్రభుత్వ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ గోసిలో పెట్టుకోవడానికి కూడా పనిచేయదని మెదక్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్ర గౌడ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్ ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రమైన శివంపేట బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను డైవర్షన్ చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లే రాజకీయ కుట్ర చేస్తుందని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదన్నారు. కాళేశ్వరంపై అసెంబ్లీలో దమ్మున్న డైనమిక్ లీడర్ హరీశ్ రావు సమాధానాలు చెపుతుంటే కాంగ్రెస్ మంత్రులు నీళ్లు నమిలారని గుర్తు చేశారు. ఓ వైపు రాష్ట్రంలో వరద బాధితులు, యూరియా సమస్య, విద్యుత్ సమస్య, మంచి నీటి సమస్య ఇలా అనేక సమస్యలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుందని, గ్రామాలలో సర్పంచ్‌లు లేక పారిశుద్ధ్యం పడకేసిందని, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలంటే తమకు భంగపాటు తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వం జంకుతుందని విమర్శించారు.
ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సారథ్యంలో తామందరం అను నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
BRS leaders | కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం : బీఆర్ఎస్ నాయకులు
Heavy rains | తిమ్మాపూర్ మండలంలో భారీ వర్షం.. రాకపోకలకు అంతరాయం
Uttarakhand | ఉత్తరాఖండ్‌కు రెడ్ అలర్ట్.. 10 జిల్లాల్లో పాఠశాలలు మూసివేత