Sunil Kumar | సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్ పొడిగింపు
Sunil Kumar | సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్‌ను ఏపీ ప్రభుత్వం పొడిగించింది. ఆలిండియా సర్వీసెస్ రూల్స్ 1969 లోని రూల్ 3(3) ప్రకారం, ఆయనపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవి కావడంతో సర్వీసులో కొనసాగించడం సముచితం కాదని ప్రభుత్వం భావించింది.
Sunil Kumar | సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్‌ను ఏపీ ప్రభుత్వం పొడిగించింది. ఆలిండియా సర్వీసెస్ రూల్స్ 1969 లోని రూల్ 3(3) ప్రకారం, ఆయనపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవి కావడంతో సర్వీసులో కొనసాగించడం సముచితం కాదని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఆయన సస్పెన్షన్‌ను పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. క్రిమినల్ కేసు పూర్తి లేదా పదవీ విరమణలో ఏది ముందైతే అప్పటి వరకు ఈ సస్పెన్షన్ కొనసాగనుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
సునీల్ కుమార్ ఏపీ కేడర్‌కు చెందిన 1993వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి. వైసీపీ హయాంలో సీఐడీ చీఫ్‌గా పనిచేశారు. ఆ సమయంలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుపై జరిగిన కస్టోడియల్ టార్చర్ ఆరోపణలతో రెండేళ్ల క్రితం గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ క్రైమ్ నంబర్ 187/2024 కేసు దర్యాప్తు దశలో ఉంది. ఈ కేసు ఆయన సర్వీస్ హోదాతో నేరుగా సంబంధం కలిగి ఉన్నందున, ఆయన్ను సర్వీసులోకి తీసుకుంటే సాక్ష్యాధారాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

