అమరావతి : కడప జిల్లా ప్రొద్దుటూరు ( Proddutur ) పట్టణం తిమ్మయ్య కాలనీలో భారీ చోరి ( Theft ) జరిగింది. కాలనీలో నివాసముంటున్న బాలిరెడ్డి కుటుంబం శనివారం పక్క గ్రామంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దొంగలు శనివారం రాత్రి ఇంట్లోకి చొరబడ్డారు.
ఇంట్లో ఉన్న 35 తులాల బంగారం, 40 తులాల వెండిని దోచుకెళ్లారు. ఆదివారం తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన స్థానికులు ఇంటి యజమానికి సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ కొండారెడ్డి, ఎస్సై సంజీవరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు.ఇంట్లోని వేలిముద్రలతో పాటు పలు ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.