‘తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ప్రొఫెసర్ జయశంకర్‌కు నిజమైన నివాళి’
తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ మేధావి, పోరాట స్ఫూర్తి ప్రదాత ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆయనను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రొఫెసర్ జయశంకర్ అందించిన సిద్ధాంత బలం, మార్గదర్శకత్వం..
– మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం, ఆగస్టు 05 : తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ మేధావి, పోరాట స్ఫూర్తి ప్రదాత ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆయనను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రొఫెసర్ జయశంకర్ అందించిన సిద్ధాంత బలం, మార్గదర్శకత్వం, త్యాగం చిరస్మరణీయమన్నారు. ఆయన చూపిన బాటలోనే తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ముందుకు నడిపించారని, అచంచల సంకల్పం, మొక్కవోని దీక్ష, సాహసోపేత పోరాటంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. తెలంగాణ గౌరవాన్ని, సామాజిక–రాజకీయ అస్తిత్వాన్ని, స్వాభిమానాన్ని పరిరక్షించుకోవడమే ప్రొఫెసర్ జయశంకర్‌కు మనం అందించే నిజమైన ఘన నివాళి అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పునరుద్ఘాటించారు.
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ నాయకత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దేశానికే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, తాగునీరు, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అన్ని రంగాల్లో విశిష్టమైన పురోగతి సాధిస్తూ, సబ్బండ వర్గాల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని సకల జనుల అభ్యున్నతికి కృషి చేయడం ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ కలల తెలంగాణను సాకారం చేసే దిశగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేసిందని తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

