Villagers Protest | రోడ్డును తీసుకుంటే..ఊరును తీసుకోవాలని గ్రామస్థుల ధర్నా
Villagers Protest | ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ఎయిర్‌పోర్టు కోసం తమ గ్రామ రోడ్డును తీసుకుంటే మొత్తం గ్రామాన్ని తీసుకోవాలని కోరుతూ అనుకుంటా గ్రామస్థులు ధర్నా నిర్వహించారు.
ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ఎయిర్‌పోర్టు( Airport ) కోసం తమ గ్రామ రోడ్డును తీసుకుంటే మొత్తం గ్రామాన్ని తీసుకోవాలని కోరుతూ అనుకుంటా గ్రామస్థులు ధర్నా ( Villagers Protest) నిర్వహించారు. బుధవారం గ్రామానికి చెందిన రైతులు కలెక్టరేట్‌కు తరలివచ్చి బైఠాయించి నిరసన తెలిపారు.ఎయిర్‌పోర్టు నిర్మాణం వల్ల నష్టపోతున్న తమ భూములకు రూ.6 కోట్లు చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.
గ్రామస్థులు ప్రస్తుతం ఆదిలాబాద్ పట్టణానికి చేరుకోవాలంటే కేవలం రెండు కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణం చేస్తుండగా రోడ్డు ఎయిర్‌పోర్టులో పోతే 16 కిలోమీటర్లు దూర భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశముందని పేర్కొన్నారు. రోడ్డుతో పాటు తమ గ్రామాన్ని మొత్తం తీసుకొని ఇతర ప్రాంతంలో తమకు పునరావసం కల్పించాలని కోరారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

