అమరావతి : రాగల కొన్ని గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ ( Meteoro logical Department ) హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాలైన పిడుగులు (Lightning strike) పడే అవకాశముందని వెల్లడించింది. విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, విశాఖ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసిందన్నారు. ఆయా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్ష సూచన పడే అవకాశముం దని, 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నరు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఈనెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వెల్లడించింది. ఉత్తర థాయిలాండ్ ప్రాంతంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, సెప్టెంబర్ 18 సాయంత్రం నాటికి ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని, దీని ప్రభావంతో సెప్టెంబర్ 19 సాయంత్రం నాటికి ఉత్తర అండమాన్ సముద్ర పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అనంతరం ఈ అల్పపీడనం క్రమంగా బలపడి, మూడు నుంచి నాలుగు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు పయనించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.