Sidharth Malhotra | స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) హీరో సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ది వాన్’. మిస్టరీ, హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థలు బాలాజీ మోషన్ పిక్చర్స్ (Balaji Motion Pictures) మరియు టీవీఎఫ్ (TVF) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, అరుణాభ్ కుమార్, మరియు నీరజ్ కొఠారి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ట్రైలర్ గమనిస్తే.. ఇది కేవలం సాధారణ హారర్ సినిమా కాకుండా, పురాతన నమ్మకాలు మరియు దైవిక శక్తుల ఆధారంగా సాగే ఒక విభిన్నమైన ఫాంటసీ థ్రిల్లర్గా కనిపిస్తోంది. ఒక ఆధునిక భావాలున్న పట్టణ యువకుడు (సిద్ధార్థ్ మల్హోత్రా) తన పూర్వీకుల గ్రామంలోని ప్రవేశ నిషేధమున్న ఒక రహస్య అడవిలోకి ప్రవేశించి, అక్కడ ఒక దివ్యమైన శక్తిని లేదా అదృశ్య రూపాన్ని మేల్కొలపడం వంటి అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. దీనివల్ల వారు ఎదుర్కొనే ఊహించని భయానక పరిణామాలు, ప్రమాదకర పరిస్థితులు ఏంటి అనేది ఈ సినిమా కథ. సినిమాలో తమన్నా పాత్ర అత్యంత కీలకమైందిగా తెలుస్తోంది. ఈ చిత్రంలో సునీల్ గ్రోవర్, మనీష్ పాల్, శ్వేతా తివారీ, అనుప్ సోని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. భారీ విజువల్స్, ఉత్కంఠభరితమైన మలుపులతో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.