KTR | టైర్-2 నగరాల్లో ఐటీ టవర్లు కూడా ఏర్పాటు చేశాం.. ‘షెహెరోన్ పే చర్చ’లో కేటీఆర్
KTR | నగర పాలక సంస్థలకు నిధుల లభ్యత అనేది ఒక పెద్ద చాలెంజ్ అని.. మన నగరాలను వేధిస్తున్న సమస్యలను పరిష్కరించడానికి వినూత్నమైన, అందరినీ కలుపుకుపోయే పరిష్కారాలు అవసరమని ‘షెహెరోన్ పే చర్చ’లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
KTR | భారత నగరాలను ప్రజల కోసం ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై న్యూఢిల్లీలో జనాగ్రహ నిర్వహించిన ‘షెహెరోన్ పే చర్చ’లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో ఉన్న భారత్ AI ఎక్స్‌పీరియెన్షియల్ సెంటర్‌ను కేటీఆర్ సందర్శించారు. ప్రజా ప్రయోజనం కోసం ఏఐ పరిష్కారాలపై పని చేస్తున్న వివిధ సంస్థల ప్రతినిధులతో కేటీఆర్ మాట్లాడారు.
పార్లమెంటేరియన్లు మహువా మాజీ, ఎస్ నిరంజన్ రెడ్డి, జనాగ్రహ సీఈవో శ్రీకాంత్ విశ్వనాథన్‌లతో జరిగినప్యానెల్ చర్చలో బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో అనుసరించిన ఉత్తమ విధానాలు, పద్దతుల గురించి కేటీఆర్ మాట్లాడారు. నగర పాలక సంస్థలకు నిధుల లభ్యత అనేది ఒక పెద్ద చాలెంజ్ అని… మన నగరాలను వేధిస్తున్న సమస్యలను పరిష్కరించడానికి వినూత్నమైన, అందరినీ కలుపుకుపోయే పరిష్కారాలు అవసరమని ఈ సందర్భంగా కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌పై భారాన్ని తగ్గించేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి కేటీఆర్ వివరించారు. ప్రతీ జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం వంటి కొన్నికార్యక్రమాలను మా ప్రభుత్వం చేపట్టింది.. అదేవిధంగా అనేక ద్వితీయ శ్రేణి (టైర్-2) నగరాల్లో ఐటీ టవర్లను కూడా ఏర్పాటు చేశామన్నారు.
పట్టణ రవాణా, ప్రజా రవాణ వ్యవస్థల గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. హై స్పీడ్ రైలు నెటవర్క్లను మెరుగుపరచడంపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తే, అది పెద్ద నగరాలపై భారాన్ని తగ్గించడంలో తప్పకుండా సహాయపడుతుందని పేర్కొన్నారు. రాబోయే దశాబ్ధంలోనే ఈ ప్రక్రియ మొదలవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.



Read Also :
‘భక్తిశ్రద్ధలు, సోదరభావంతో గణేష్ ఉత్సవాలను నిర్వహించాలి’
TN CM Vijay | లండన్‌లో తమిళనాడు సీఎం విజయ్ ఈవెంట్ రద్దు.. అభిమానులకు నిరాశ..!
Jobs Notification | ఏపీలో 2,050 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

