Hair Fall | జుట్టు రాలడం తగ్గాలంటే ఈ పోషకాలు అవసరం.. వీటిని రోజూ తీసుకోవాలి..
అందమైన, ఆరోగ్యవంతమైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. అనేక రకాల హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉంటారు. అయినప్పటికీ చాలా మందికి అందమైన జుట్టును సొంతం చేసుకోవడం ఒక కల లాగానే ఉంటుందని చెప్పవచ్చు.
Hair Fall | అందమైన, ఆరోగ్యవంతమైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. అనేక రకాల హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉంటారు. అయినప్పటికీ చాలా మందికి అందమైన జుట్టును సొంతం చేసుకోవడం ఒక కల లాగానే ఉంటుందని చెప్పవచ్చు. ఒత్తైన, ఆరోగ్యవంతమైన జుట్టు కావాలనుకునే వారు హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడడంతో పాటు జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే సప్లిమెంట్స్ ను కూడా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఈ సప్లిమెంట్స్ జుట్టు పెరుగుదలలో గణణీయమైన మార్పును తీసుకు వస్తాయని వారు సూచిస్తున్నారు. జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడం, జుట్టును మందంగా, ఒత్తుగా చేయడం, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం వంటి పనులను సప్లిమెంట్స్ నిర్వహిస్తాయని చెప్పవచ్చు. కనుక జుట్టు పెరుగుదలకు అవసరమైన వివిధ రకాల సహజ సప్లిమెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బయోటిన్..
జుట్టు పెరుగుదలకు మద్దతు ఇచ్చే వాటిల్లో బయోటిన్ ఒకటి. జుట్టు నిర్మాణానికి అవసరమయ్యే కెరాటిన్ అనే ప్రోటీన్ ను సంశ్లేషణ చేయడంలో ఈ బి విటమిన్ సహాయపడుతుంది. చాలా మంది బయోటిన్ లోపంతో బాధపడుతూ ఉంటారు. దీంతో జుట్టు రాలడం, పలుచగా తయారవ్వడం, జుట్టు విరిగిపోవడం వంటివి జరుగుతాయి. జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఆహారంలో గుడ్లు, గింజలు, తృణ ధాన్యాలు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ విటమిన్ లోపంతో మరింత ఎక్కువగా బాధపడే వారు బయోటిన్ సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల జుట్టు సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. సా పాల్మెట్టో అనే సప్లిమెంట్ ను తీసుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా బట్టతలతో బాధపడే వారు ఈ సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ సప్లిమెంట్ జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు జుట్టు తిరిగి పెరిగేలా ప్రోత్సహిస్తుంది. బట్టతలతో బాధపడే వారు ఎక్కువగా సింథటిక్ చికిత్సలను తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారు సా పాల్మెట్టో సప్లిమెంట్ ను తీసుకోవడం ద్వారా చికిత్స అవసరం లేకుండా సహజంగా తిరిగి జుట్టును పొందవచ్చు.
అశ్వగంధ..
జిన్సెంగ్ ( అశ్వగంధ) ను సాంప్రదాయ వైద్యంలో చాలా కాలంగా వాడుతున్నారు. ఈ సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల తలకు రక్తప్రసరణ పెరుగుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. జుట్టు తెల్లగా మారడాన్ని అకాల బూడిద రంగును నివారించడంలో జిన్సెంగ్ ఎంతో సహాయపడుతుంది. ఈ సప్లిమెంట్స్ ను తీసుకోవడం ద్వారా లేదా జుట్టుకు అప్లై చేయడం ద్వారా ఒత్తుగా, ఆరోగ్యవంతమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. సాధారణంగా వయసు పెరిగే కొద్ది కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీని వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల తలచర్మం ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు జుట్టు బలంగా తయారవుతుంది.
రోజ్మేరీ ఆయిల్..
జుట్టు రాలడాన్ని తగ్గించడంలో రోజ్మేరీ ఆయిల్ కూడా చక్కగా పని చేస్తుంది. జుట్టు సాంద్రతను గణనీయంగా పెంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, చుండ్రు సమస్యను తగ్గించడంలో, మొత్తం జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో రోజ్మేరీ ఎంతో సహాయపడుతుంది. ఈ మధ్యకాలంలో జుట్టు సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల అసమతుల్యత, రసాయనాలు కలిగిన ప్రొడక్ట్స్ ను వాడడం, ఒత్తిడి వంటి వివిధ కారణాల వల్ల జుట్టు రాలడం ఎక్కువవుతోంది. ఇటువంటి సమస్యలతో బాధపడే వారు ఆయా చెప్పిన సప్లిమెంట్స్ ను వాడడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ఈ సప్లిమెంట్స్ ను వాడడం ద్వారా జుట్టు సమస్యలు తగ్గడంతో పాటు మొత్తం జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతమైన, ఒత్తైన, కాంతివంతమైన జుట్టును సొంతం చేసుకోవచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- hair fall
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

