Clay Ganesh | నర్సాపూర్, ఆగస్టు 26 : నర్సాపూర్ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ బంధు ఆధ్వర్యంలో రేపు (బుధవారంవారం) ఉదయం 9 గంటలకు నర్సాపూర్ బస్ స్టాప్ ముందుగల శ్రీ ఉమేష్ మెడికల్ జనరల్ స్టోర్ వద్ద మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని లయన్స్ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ మంద జయపాల్, సెక్రటరీ లయన్ కొండ శ్రీకాంత్, ఆకుల సుధాకర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. రోజు ఇండ్లలో గణపతులను పెట్టుకుని పూజించే భక్తులు మట్టి గణపతులను తీసుకువెళ్లాల్సిందిగా కోరారు. మట్టి గణపతిని పూజించడం వలన పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కృత్రిమ రంగులతో తయారుచేసిన గణపతులను చెరువులో వేయడం వలన నీటి కాలుష్యం ఏర్పడుతుందన్నారు. నీటిలో ఉండే జీవరాశులు మృతి చెందే అవకాశం ఉంది. అందువల్లే మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.
Nennela | నెన్నెల మండలంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలి : ఎంపీడీవో మహ్మద్ అబ్దుల్
Annamalai | బీజేపీ నేత అన్నామలై చేతులమీదుగా మెడల్ అందుకోవడానికి నిరాకరించిన యువకుడు.. వీడియో
Hyderabad | ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. మెహిదీపట్నంలో ప్రమాదం