జై నూర్ : ఏజెన్సీ ప్రాంతాలలోచట్టాలకు లోబడి ఇసుక వేలంపాట ( Sand auction ) వేయాలని ప్రధాన్ పురోహిత్ సంఘం మండల కార్యదర్శి కనక రామ్ ( Kanaka Ram ) శుక్రవారం మండల తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ద్వారా ఇసుక వేలంపాట వేస్తే ఆదివాసేతరులు పాల్గొనే అవకాశం ఉందని వెల్లడించారు.
బినామీ పేర్లతో మండల కేంద్రంలో లైసెన్స్ లేకుండా అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని ఆరోపించారు. ఈ విషయంలో అధికారులు పట్టించుకోవాడం లేదని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని అమలు కావడం లేదని అన్నారు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులను ఆసరాగా చేసుకొని కొంతమంది ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక వేలంపాటలో అసలైన ఆదివాసులకు అన్యాయం జరుగుతుందని వివరించారు.