CITU | నర్సాపూర్, అక్టోబర్ 12 : కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు జయప్రదం చేయడం కోసం కార్మికులు, ప్రజలు విరాళాలు ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం వైస్ చైర్మన్ ఎం అడివయ్య పిలుపునిచ్చారు.
మెదక్ పట్టణ కేంద్రంలో డిసెంబర్ 7,8,9 మహాసభలు నిర్వహిస్తున్నామని, మహాసభలా నిర్వహణ కోసం ఆదివారం నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట గ్రామంలో ఇంటింటికి విరాళాలు సేకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నిరంతరం కార్మికుల పక్షాన పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం సీఐటీయూ అన్నారు. తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు మెదక్ జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
మెదక్ జిల్లాలో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. స్కీమ్ వర్కర్లతో ప్రభుత్వాలు వెట్టిచాకిరి చేయిస్తున్నాయని అన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కనీస వేతనాలు అమలు చేయకుండా కార్మికుల శ్రమను యాజమాన్యాలు దోచుకుంటున్నాయని అన్నారు.
ఆటో, హమాలి, భవన నిర్మాణ కార్మికులకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు. ఈ మహాసభలలో కార్మికుల సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. జిల్లాలోని కార్మికులు, ప్రజలు విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు పాల్గొన్నారు.
Bihar Election | అభ్యర్థులను ఖరారు చేసిన జేడీయూ.. నాలుగు స్థానాలలో సిట్టింగ్లకు ఉద్వాసన..!
Explosives In Bag | వదిలేసిన బ్యాగులో పేలుడు పదార్థాలు.. బాంబ్బ్లాస్ట్కు కుట్రగా అనుమానం
Narnoor | మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు : ఎస్ఐ అఖిల్