Padma devender reddy | మెదక్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : మెదక్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురడం ఖాయమని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేపటితో ప్రచారం సమయం ముగిసిపోవడంతో అన్ని వార్డుల్లో ప్రచారం జోరందుకుంది. మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కోసం మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్ రెడ్డిలు అభ్యర్థుల తరఫున ముమ్మర ప్రచారం చేస్తున్నారు.
ఓటింగ్ కోసం మూడు రోజులే సమయం ఉండడంతో వార్డుల్లో భారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల లోపు ప్రచారం ముగిస్తుండడంతో వార్డుల వారిగా గెలుపు కోసం ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఓటర్లకు వివరిస్తున్నారు. మెదక్ ను అన్ని రంగాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని ప్రచారం చేస్తున్నారు. మెదక్‌ను జిల్లా కేంద్రంగా చేసి కలెక్టర్ ఎస్పీ ఆఫీసు తో పాటు ప్రధాన శాఖలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రజల సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని..
ప్రభుత్వ పాలనను ప్రజల వద్దకు తీసుకురావడంలో కేసీఆర్ సర్కార్ ఎంతో కృషి చేసిందని తెలుపుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని కోరుతున్నారు. అన్ని వర్గాలకు ప్రజల సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని తెలుపుతున్నారు.
మెదక్, రామాయంపేట్, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీలో గులాబీ విజయం ఖాయం. మెదక్ జిల్లాలో ఉన్న తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట, మెదక్ మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురడం ఖాయమని బీఆర్ఎస్ నేతలు భీమా వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ నాయకులు ఓటమి భయంతో బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేసినా భయపడకుండా వార్డుల్లో ప్రచారాలు చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు గులాబీ నేతలను బెదిరింపులకు గురిచేసినా.. పోలీస్ కేసులు నమోదు చేసేందుకు ప్రయత్నం చేసినా ప్రచారంలో వెనకడుగు వేయడం లేదు. అధికార పార్టీ నాయకులు ఎన్నికల నియమావళి అమలు చేయకపోయినా ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదు. మెదక్ జిల్లాను గులాబీమయం చేసేందుకు పార్టీ నేతలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు .


Nizampet | నిజాంపేటలో ఘనంగా పోచమ్మ తల్లికి బోనాలు
Madhya Pradesh | పెండ్లి కార్డులు పంచడానికి వెళ్తుండగా బైకును ఢీకొన్న ఆడి కారు.. ముగ్గురు మృతి