Madhya Pradesh | పెండ్లి కార్డులు పంచడానికి వెళ్తుండగా బైకును ఢీకొన్న ఆడి కారు.. ముగ్గురు మృతి
Madhya Pradesh : మధ్యప్రదేశ్లోని రెవా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు ఒక బైకును ఢీకొనడంతో బైకుపై ఉన్న ముగ్గురు మరణించారు. మృతుల ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది.
Madhya Pradesh : మధ్యప్రదేశ్లోని రెవా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు ఒక బైకును ఢీకొనడంతో బైకుపై ఉన్న ముగ్గురు మరణించారు. మృతుల ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. రెండు వారాల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది.
పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్, రేవా జిల్లా, కోస్తా గ్రామానికి చెందిన భగవత్ విశ్వకర్మ (55), అతడి కొడుకు శివం విశ్వకర్మ, వారి బంధువు శీతల్ విశ్వకర్మ ముగ్గురు తమ స్వగ్రామం నుంచి బైకుపై బయల్దేరారు. ఈ నెల 24న భగవత్ పెద్ద కొడుకు వివాహం జరగాల్సి ఉంది. దీంతో పెండ్లి ఆహ్వాన పత్రికలు పంచేందుకు బైకుపై వెళ్తుండగా ప్రయాగ్రాజ్ నుంచి వస్తున్న ఆడి కారు.. రేవా- ప్రయాగ్ రాజ్ హైవేపై వారి బైకును ఢీకొంది. కారు వేగంగా ఉండటంతో ఆ ముగ్గురు బైకు నుంచి ఎగిరిపోయి, డివైడర్ను ఢీకొన్నారు. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన వారి ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలోనే జరిగింది.
ఘటనలో కారు ముందు భాగంతోపాటు బైకు నుజ్జునుజ్జయింది. ఘటన జరిగిన వెంటనే ఆడి కారు డ్రైవర్ను స్థానికులు పట్టుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురి మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

