MLA Sunitha Lakshma Reddy | నర్సాపూర్, జనవరి 3 : కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలు బడేబాయ్, చోటేబాయ్ అంటూ కలిసిపోయి ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కాయని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం నర్సాపూర్ మున్సిపాలిటీలోని 1వ, 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థులు ఆరట్ల సంగీతమల్లేశం, హమీద్‌ల తరుపున ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ధరల నియంత్రణలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయని, 2 కోట్ల ఉద్యోగాలిస్తామని, జీరో అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామని ప్రజలను బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని గుర్తు చేశారు. అలాగే కిసాన్ సమ్మాన్ యోజన కూడా సరిగ్గా వేయడం లేదని ప్రజలు అంటున్నారని వెల్లడించారు. 8 మంది ఎంపీలలో మెదక్ ఎంపీ గెలిచినా నయా పైసా కూడా నర్సాపూర్ నియోజకవర్గానికి తీసుకురాలేకపోయారని విమర్శించారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏకమై బీఆర్ఎస్ను ఓడించాలని చూస్తున్నాయని, ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వైపే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ ఇంటికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, కేసీఆర్ ఉన్నప్పుడే న్యాయం జరిగిందని ప్రజలు బాహాటంగా చెబుతున్నారని వెల్లడించారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, స్కాలర్ షిప్ ఆగిపోయాయని ప్రజలు తెలియజేశారని అన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నేడు ప్రజలు గుర్తుచేసుకుంటూ బీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటేస్తామని బాహాటంగా చెబుతున్నారని వెల్లడించారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయం..
కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, స్కాలర్షిప్ ఆగిపోయాయని ప్రజలు తెలియజేశారని అన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నేడు ప్రజలు గుర్తు చేసుకుంటూ బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేస్తామని అంటున్నారని వెల్లడించారు. ఏ ఇంటికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు రూ.2 వేల పింఛన్లు రూ.4 వేలు చేస్తానని ఇవ్వలేదని, ఇండ్లు ఇస్తామని ఇవ్వలేదని, స్కూటీలు రాలేదని, తులం బంగారం ఇవ్వలేదని, మహిళలకు రూ.2,500 ఇస్తామని ఇవ్వలేదని, రూ.5 లక్షల విద్యా గ్యారెంటీ ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి రాలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి, ప్రజలను మోసం చేసి, మభ్యపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపుగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని తెలిపారు. 1వ, 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థులు ఆరట్ల సంగీతమల్లేశం, హమీద్‌లను కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, జడ్పీ కో-ఆప్షన్ మాజీ సభ్యులు మన్సూర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు గోపి, మాజీ సర్పంచ్‌లు సేనాధిపతి, రవి తదితరులు పాల్గొన్నారు.



Jagthyal | జగిత్యాల మున్సిపల్ పోరులో జీవన్ రెడ్డి vs సంజయ్