BRS Flag | నర్సాపూర్: బీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకుని 24 సంవత్సరాలు పూర్తిచేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా గులాబీ సైన్యం సందడి నెలకొంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో ఇవాళ నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాల్లో, పల్లెల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా సగౌరవంతో రెపరెపలాడింది.
అలాగే ఎల్కతుర్తిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు గ్రామాల్లో బీఆర్ఎస్ సైనికులు జెండాను ఎగరవేసి సభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. 24 ఏండ్ల బీఆర్ఎస్ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగి తేలారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ, తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చిన పార్టీ, మున్ముందు తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీయేనంటూ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
గ్రామ గ్రామాన, పల్లె పల్లెన జెండా గద్దెలకు గులాబీ రంగు పూసి ఇది మా ఆత్మగౌరవ ప్రతీక అంటూ పార్టీ శ్రేణులు, ప్రజలు బీఆర్ఎస్ జెండాలను ఎగరవేశారు. జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై సునీతాలక్ష్మారెడ్డి, జై తెలంగాణ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున దిక్కులు పిక్కటిల్లెల నినాదాలు చేశారు.
Giloy | సర్వ రోగ నివారిణి.. తిప్పతీగ.. మన చుట్టూ పరిసరాల్లోనే ఈ మొక్క పెరుగుతుంది..!
Putta Madhukar | మంత్రి పదవి మంథనికి పైస మందం కూడా పనికొస్తలేదు : పుట్ట మధుకర్
BRS | బీఆర్ఎస్ సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు రావని బెదిరిస్తున్నారు : దాసరి మనోహర్ రెడ్డి