Beedi Workers | రామాయంపేట, జూన్ 23 : బీడీ కార్మికులకు కేటాయించిన ప్లాట్లను కొంత మంది అక్రమార్కులు కావాలనే అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని అలాంటి రిజిస్ట్రేషన్లను ఆపాలని లబ్దిదారులు, యాదవ సంఘం నాయకులు తహసీల్దార్ రజినీకుమారిని కోరారు.
సోమవారం ప్రజావాణిలో భాగంగా రామాయంపేట తహసీల్దార్ కార్యాలయానికి బీడీ కార్మిక లబ్దిదారులు తరలివెల్లి వినతి పత్రం అందజేశారు. రామాయంపేట పట్టణంలో గత కొన్నేండ్ల క్రితం బీడీలు చేసే వారికి ప్లాట్లను ఇవ్వడం జరిగిందని వాటిని కావాలనే పట్టణంలోని ఓ వ్యక్తి గుట్టు చప్పుడు గాకుండా రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగిందన్నారు.
తక్షణమే వాటిని సర్వేలు చేసి లబ్దిదారులకు అట్టి ప్లాట్లను అప్పగించాలని కోరారు. లేకుంటే లబ్దిదారులతో ఆందోళన చేపడ్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజు యాదవ్, తాడెం మల్లయ్య, గొల్ల రమేశ్, స్వామిలు ఉన్నారు.
Alumni | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థులంతా కలిశారు
Rayaparthi | వ్యవసాయ భూములకు వెళ్లే బాట కబ్జా.. కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన
Suryapet | కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకారం అవసరం : జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన