V Srinivas Goud | బీఆర్ఎస్ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని.. అధికార పార్టీ ఎమ్మెల్యేతోపాటు మరికొందరు మీకు పదవులు ఇస్తాం.. డబ్బులు ఇస్తాం అంటూ ప్రలోభ పెడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లోని నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. మార్కెట్ చైర్మన్, ముడా చైర్మన్ రాష్ట్ర స్థాయిలో పదవులు ఇస్తామని పార్టీ మారమంటున్నారు. ఇదేం పద్ధతి కార్పొరేషన్ అయి రెండు నెలలు కాకముందే ఇలా మా పార్టీ కార్పొరేటర్లను లాగే ప్రయత్నం చేయడం దారుణం. కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలని మేమంతా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఏకగ్రీవంగా కావడానికి సహకరించినమన్నారు.
ఎమ్మెల్యే ధన్యవాదాలు చెప్పి అందరూ అభివృద్ధికి సహకరించాలన్నారు. మరి ఇప్పుడు మా కార్పొరేటర్లను గుంజుకునే ప్రయత్నమా..? ఏ కార్పొరేషన్ లో జరగని విధంగా ఇక్కడ తొలి మీటింగ్‌లో జరిగినందుకే అడిగినం.. బాజాప్త అడుగుతామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మీ పార్టీలోనే చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. మీ పార్టీని చక్కదిద్దుకోండి.. పార్టీ మారితే పైసలు ఇస్తాం.. వ్యాపారాలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. పోలీసులతో ఇబ్బంది లేకుండా చేస్తున్నామని అంటున్నారు. ముందు అభివృద్ధిపై దృష్టి పెట్టండి. ప్రత్యేక నిధులు తీసుకురా…అవన్నీ వదిలేసి మల్ల మా నాయకులను పార్టీలోకి తీసుకోవాలని చూస్తే సహించమని హెచ్చరించారు.
పోలీసులకు సమాజంలో గౌరవం ఉంది. ఎమ్మెల్యే చెప్పినట్లు వింటే ఇంకో రెండేళ్లు ఉండొచ్చనుకుంటే పొరపాటు.. మీకు అంత ఇది ఉంటే మీరే కండువాలు కప్పుకోండి.. మీరు మంచి చేయండి అభివృద్ధికి సహకరిస్తాం.. డివిజన్లలో రూ.50 వేలు మోటార్లకు డబ్బులు లేవు అంటున్నారు. రూ.30 నుంచి రూ.40 లక్షలు పెట్టి ఛాంబర్లు చేసుకుంటున్నారు. డీసెంట్ నోటీస్ ఇద్దామని అంటే నేను వారించిన. కార్పొరేటర్లు బెదిరిస్తే బెదరం…పద్ధతి మార్చుకోకపోతే సహించేది లేదన్నారు.
Trisha | త్రిష సైలెంట్ రియాక్షన్ వైరల్ ..రాజకీయ వివాదాల మధ్య లవ్ కోట్స్‌తో సందేశం